Pawan Kalyan: మంగళగిరి కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన పవన్ కల్యాణ్
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జనసేన నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. జాతీయ జెండాను ఎగురవేసిన పవన్ కల్యాణ్ వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు.