Team India: టీం ఇండియా మేనేజర్‌ దురుసు ప్రవర్తన.. బీసీసీఐ సీరియస్!

  • వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా మేనేజర్ సునీల్ సుబ్రహ్మణ్యం
  • టీమిండియాతో ఓ వీడియో షూట్ చేయాలనుకున్న భారత హైకమీషన్
  • అనుమతి కోరిన అధికారులతో సునీల్ దురుసు ప్రవర్తన
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా మేనేజర్ సునీల్ సుబ్రహ్మణ్యం దురుసు ప్రవర్తనపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఇండియాకు బయలుదేరి రావాలని ఆదేశించింది. నీటి సంరక్షణపై అవగాహన కల్పించే ఓ వీడియో షూట్ ను రూపొందించాలని వెస్టిండీస్ లోని భారత హై కమీషన్ భావించింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెస్టిండీస్ లో ఉన్న టీమిండియా క్రికెటర్లతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని అనుకుంది. ఈ క్రమంలో టీం ఇండియా మేనేజర్ సునీల్ సుబ్రహ్మణ్యంను అనుమతి కోరింది. అయితే, భారత హైకమీషన్ అధికారులతో ఆయన దురుసుగా ప్రవర్తించడంతో సదరు అధికారులు బీసీసీఐకు ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారాన్ని కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ తీవ్రంగా పరిగణించడంతో సునీల్ ని తక్షణం భారత్ కు తిరిగి రావాలని ఆదేశించినట్టు సమాచారం. సుబ్రహ్మణ్యం దురుసు ప్రవర్తనకు గాను టీమిండియా మేనేజర్ పదవి నుంచి ఆయనను తొలగించినట్టు సమాచారం.
Team India
Mangaer
Sunil subramanyam
Bcci

More Telugu News