Andhra Pradesh: జగన్ గాలి మాటలు మాట్లాడుతున్నారు: నారా లోకేశ్ ధ్వజం

  • ఆరోగ్య సంరక్షణలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉంది
  • నీతి ఆయోగ్ నివేదికే ఇందుకు నిదర్శనం
  • మా పాలనలో అభివృద్ధి సాధించలేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు
ఏపీలో గత పాలనలో ఆరోగ్య వ్యవస్థ పట్టాలు తప్పిందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత నారా లోకేశ్ ఖండించారు. ఏపీలో ఆరోగ్య వ్యవస్థ పట్టాలు తప్పిందని, గాడిన పెట్టడానికి తాను దేవుడిలా దిగొచ్చానన్నట్టుగా జగన్ ట్వీట్ చేస్తారని విమర్శించారు. ఆరోగ్య సంరక్షణలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందని నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను లోకేశ్ పోస్ట్ చేశారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించలేదని ప్రజలను నమ్మించేందుకు జగన్ అనేక గాలి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గత ఐదేళ్ళలో అన్ని వ్యవస్థలూ పట్టాలపైనే పరుగులు పెట్టాయని, జగన్ అధికారంలోకి వచ్చాక ఏకంగా ఆ పట్టాలనే పీకేస్తున్నారని విమర్శించారు.
Andhra Pradesh
cm
jagan
Telugudesam
Nara Lokesh

More Telugu News