Jammu And Kashmir: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోండి: జమ్ముకశ్మీర్ అడిషనల్ డీజీపీ

  • వేడుకలకు సర్వం సిద్ధం చేశాం
  • భద్రతను పటిష్టం చేశాం
  • ఆంక్షలను సడలించాం
రేపు జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని జమ్మూకశ్మీర్ అడిషనల్ డీజీపీ మునీర్ ఖాన్ పిలుపునిచ్చారు. వేడుకలకు సర్వం సిద్ధం చేశామని తెలిపారు. అన్ని ఆంక్షలను సడలించామని చెప్పారు. అయితే, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఇంకా కొన్ని రోజుల సమయం పడుతుందని అన్నారు. ప్రస్తుతం తమ దృష్టి మొత్తం ఆగస్ట్ 15పైనే ఉందని చెప్పారు. బందోబస్తును పటిష్టం చేశామని... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలు ఎలాంటి అభద్రతా భావానికి గురికాకుండా స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాలని అన్నారు.
Jammu And Kashmir
Independence Day

More Telugu News