Mashaal Malik: పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ భార్య

  • ఇస్లామాబాద్ లో పాక్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
  • పాక్ అధ్యక్షుడు పాల్గొన్న కార్యక్రమంలో ప్రసంగించిన మషాల్ మాలిక్
  • భారత్ పై ఇప్పటికీ విషం చిమ్ముతున్న వేర్పాటువాదులు
కశ్మీర్ వేర్పాటువాదులలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికీ వారు భారత్ పై విషం చిమ్ముతూనే ఉన్నారు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగం అనే నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. జమ్మూకశ్మీర్ లో ఉన్న వేర్పాటువాదులంతా ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. జేకేఎల్ఎఫ్ అధినేత యాసిన్ మాలిక్ కూడా ఓ జైల్లో ఉన్నారు. కానీ, ఆయన భార్య మషాల్ మాలిక్ మాత్రం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఉన్నారు. ఈరోజు జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ పాల్గొన్న ఆ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు కూడా. కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం అక్కడి ప్రజలు పోరాడుతున్నట్టుగా ఆమె రచించిన ఓ పద్యాన్ని కూడా ఆమె వినిపించారు.
Mashaal Malik
Yasin Malik
Kashmir
Pakistan
Independence Day

More Telugu News