YSRCP: కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ ను కలిసిన వైసీపీ నేతలు

  • టూరిజం ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానం
  • రాష్ట్రానికి రావాల్సిన రూ. 900 కోట్లను విడుదల చేయాలని విన్నపం
  • కూల్చివేసిన ఆలయాల నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని విన్నపం
కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ను వైసీపీ నేతలు కలిశారు. ఏపీలో త్వరలో నిర్వహించనున్న టూరిజం ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు రావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రహ్లాద్ సింగ్ ను ఆహ్వానించారు. ఇదే సమయంలో కేంద్ర పర్యాటకశాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. 900 కోట్లను విడుదల చేయాలని విన్నవించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చివేసిన 24 దేవాలయాల నిర్మాణానికి నిధులను ఇవ్వాలని కోరారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 
YSRCP
Prahlad Singh
Vijaya Sai Reddy
Avanthi Srinivas

More Telugu News