Andhra Pradesh: టీడీపీ నేతలను చంద్రబాబే బీజేపీలోకి పంపించారు!: తెలంగాణ మంత్రి తలసాని

  • క్యాడర్ లేని లీడర్లతో ప్రయోజనం లేదు
  • బీజేపీలో కాలంతీరిన నేతలే చర్చిస్తున్నారు
  • హైదరాబాద్ లో మీడియాతో టీఆర్ఎస్ నేత
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ టీడీపీ, బీజేపీపై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలను చంద్రబాబు స్వయంగా బీజేపీలోకి పంపారని ఆయన ఆరోపించారు. క్యాడర్ లేకుండా నేతలను చేర్చుకున్నంత మాత్రాన ఏ పార్టీ కూడా బలపడదని స్పష్టం చేశారు. ప్రస్తుం బీజేపీలో కాలంతీరిన నేతలు(ఔట్ డేటెడ్ క్యాండిడేట్స్) చేరుతున్నారనీ, దీనివల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదని తేల్చిచెప్పారు. హైదరాబాద్ లో ఈరోజు తలసాని మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత ఓటు బ్యాంకు కూడా బీజేపీకి లేదని తలసాని తెలిపారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గాలి పనిచేసిందని తలసాని అంగీకరించారు. రాజకీయాలకు పనికిరాని కొందరు వ్యక్తులు  ఆ గాలిలోనే తెలంగాణలో గెలుపొందారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ ను కూడా కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారన్నది ఊహాగానాలేనని స్పష్టం చేశారు.
Andhra Pradesh
Telangana
TRS
BJP
Congress
Telugudesam
Chandrababu
Talasani

More Telugu News