Andhra Pradesh: జగన్ గారూ.. ఇప్పుడు మీ కడుపు మంట చల్లారిందా?: నారా లోకేశ్ ఆగ్రహం

  • మీ మనుషులతో కేసులు వేయించారు
  • ఎత్తిపోతల పథకాలను ఎన్జీటీ ఆపేసింది
  • ఏపీ సీఎంపై మండిపడ్డ టీడీపీ నేత
ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉండగా తన మనుషుల చేత కేసులు వేయించి గోదావరి - పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులు ఆపించారని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఈ చర్యలతో రైతుల నోటిలో మట్టికొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ చేసిన పాపం ఇప్పుడు ఎదురుతన్నిందని దుయ్యబట్టారు.

ఇప్పుడు గోదావరి - పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టులను ఆపేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాలు జారీచేసిందని పేర్కొన్నారు.  ఈ ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చి, నిర్మాణం పూర్తిచేసి రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు చేసిన పాపాలను కడుక్కోవాలని సూచించారు.
Andhra Pradesh
Jagan
Chief Minister
YSRCP
Telugudesam
Nara Lokesh
Lift irregation projects

More Telugu News