Telangana: తెలంగాణలో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు!

  • కామారెడ్డి జిల్లాలో ఘటన
  • ప్రమాదసమయంలో బస్సులో 32 మంది పిల్లలు
  • స్కూలు యాజమాన్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఈరోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తాడ్వాయి మండలం, దేవాయిపల్లిలో వేగంగా వెళుతున్న ఓ ప్రైవేటు స్కూలు బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 32 మంది పిల్లలు ఉన్నారు.

కాగా, ఈ ఘటనలో ఎవ్వరికీ తీవ్రగాయాలు కాలేదు. బస్సు పక్కకు ఒరిగిపోవడాన్ని గమనించిన స్థానికులు, రైతులు పిల్లలను బయటకు తీశారు. కాగా, స్కూలు పిల్లలను తీసుకెళ్లేందుకు పాత బస్సును వాడుతోందనీ, ఎన్నిసార్లు తాము ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana
school bus
Road Accident
Kamareddy District
32 students

More Telugu News