Jammu And Kashmir: జమ్మూ కశ్మీర్ లో ఆంక్షల ఎత్తివేత!

  • కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 144 సెక్షన్
  • దశలవారీగా సైన్యం ఉపసంహరణ
  • మీడియాకు వెల్లడించిన మునీర్ ఖాన్
పార్లమెంట్ లో జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు, ఆర్టికల్ 370 రద్దు బిల్లులను ప్రవేశపెట్టడానికి రెండు రోజుల ముందు నుంచి రాష్ట్రంలో మొదలైన ఆంక్షలను తొలగిస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో పోలీసు బందోబస్తు మాత్రం కొనసాగుతుందని ప్రజలంతా సహకరించాలని కోరారు. ఏ విధమైన పుకార్లనూ నమ్మవద్దని, పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా ఉందని, ప్రతి ఒక్కరూ తమ పనులను తాము చేసుకోవచ్చని శ్రీనగర్ లో జరిగిన మీడియా సమావేశంలో సీనియర్ పోలీస్ అధికారి మునీర్ ఖాన్ వెల్లడించారు.

కాశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం 144 సెక్షన్ వంటి ఆంక్షలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక పోలీసు బలగాల ఉపసంహరణను ప్రారంభించామని అన్నారు. దశలవారీగా అదనపు సైన్యాన్నంతా వెనక్కు పంపివేయనున్నామని మునీర్ ఖాన్ తెలిపారు. ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న 400 మంది రాజకీయ నేతల విడుదలపై మాత్రం ఎటువంటి నిర్ణయాన్నీ పోలీసులు ఇంకా తీసుకోలేదని తెలుస్తోంది.
Jammu And Kashmir
Police
Army
Restrictions
Muneer Khan

More Telugu News