Andhra Pradesh: టీడీపీ నేతలు ఒక్కో అన్న క్యాంటీన్ ఏర్పాటులో రూ.50 లక్షలు దోచేశారు!: బొత్స ఆగ్రహం

  • వాటిని ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేశారు
  • మూతపడిన క్యాంటీన్లను వచ్చే నెలలో తెరుస్తాం
  • పేదలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేస్తాం
టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లను ప్రభుత్వ స్థలాల్లోనే ఏర్పాటు చేశారని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ క్యాంటీన్ల ఏర్పాటులో భారీగా అవినీతి చోటుచేసుకుందని విమర్శించారు. మూతపడిన అన్న క్యాంటీన్లను వచ్చే నెల మొదటివారంలో తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.

టీడీపీ నేతలు ఒక్కో క్యాంటీన్ ఏర్పాటులో రూ.50 లక్షలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో ప్రారంభించే అన్న క్యాంటీన్లు ఆసుపత్రులకు సమీపంలో పేదలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
Andhra Pradesh
Telugudesam
anna canteen
corruption
minister
Botsa Satyanarayana
YSRCP

More Telugu News