Roja Ramani: మా తరుణ్ కి త్వరలోనే పెళ్లి చేస్తాం: రోజా రమణి

  • మండపేట వచ్చిన రోజారమణి 
  • మంచి అమ్మాయి కోసం చూస్తున్నాం 
  • నిశ్చయం కాగానే అందరికీ చెబుతా 
తన కుమారుడు తరుణ్ కు త్వరలోనే వివాహం జరిపించనున్నట్టు సీనియర్ నటి, డబ్బింగ్ కళాకారిణి రోజారమణి వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు మరో నటి కవితతో కలిసి మండపేటకు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడారు. తాను ప్రస్తుతం డబ్బింగ్ మాత్రమే చెబుతున్నానని అన్నారు. ఇప్పటివరకూ 130కిపైగా సినిమాల్లో నటించానని, ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పానని అన్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు పట్టణానికి వచ్చానని వెల్లడించిన రోజారమణి, తరుణ్ కోసం మంచి అమ్మాయిని చూస్తున్నట్టు తెలిపారు. వివాహం నిశ్చయం కాగానే, అందరికీ వెల్లడిస్తానని అన్నారు.
Roja Ramani
Tarun
Marriage

More Telugu News