Chandrababu: పోలవరంపై ఇప్పటికైనా తలకెక్కుతుందా ఈ మేధావులకి!: చంద్రబాబు

  • పోలవరంపై సమీక్ష నిర్వహించిన ప్రాజక్టు అథారిటీ
  • టెండర్లు నిలిపివేయడం సరికాదన్న అథారిటీ సభ్యులు
  • ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు
పోలవరం ప్రాజక్టు టెండర్లు నిలిపివేయడం సరికాదంటూ పోలవరం అథారిటీ పేర్కొన్న నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. పోలవరం ప్రాజక్టు అథారిటీ నేడు సమావేశమై సమీక్ష నిర్వహించింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చాం కదా ఏదో కాస్త హడావుడి చేసేద్దాం అనుకుంటే తప్పులేదని, ఇల్లు పీకి పందిరి వేద్దాం అనే ఆలోచన మాత్రం రాకూడదని హితవు పలికారు. ఏదైనా విషయంలో మనకు తెలియకపోతే ఇతరులు చెప్పింది వినాలని, కానీ కొందరు వినరంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. కొన్నాళ్లుగా తాము మొత్తుకుంటున్న విషయాలనే ఇవాళ పోలవరం అథారిటీ కూడా చెప్పిందని, ఇప్పటికైనా ఈ మేధావులకు తలకు ఎక్కుతుందో, లేదోనని విమర్శించారు.
Chandrababu
Jagan
Polavaram
Telugudesam
YSRCP

More Telugu News