Andhra Pradesh: దివాళలో ఉన్న రాష్ట్రాన్ని సీఎం జగన్ దారిలో పెడుతున్నారు: సి.రామచంద్రయ్య

  • ఏపీలో అవినీతికి కారణం చంద్రబాబే
  • ప్రభుత్వం ఎలా నడుచుకోవాలో చెప్పే అర్హత బాబుకు లేదు
  • రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ సహకరించాలి
దివాళలో ఉన్న ఏపీని సీఎం జగన్ దారిలో పెడుతున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య అన్నారు. ఏపీలో అవినీతికి కారణం చంద్రబాబే అని, రాజధాని అమరావతి విషయంలో దళారీలను పెంచి పోషించారని ఆరోపించారు. టీడీపీ వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అన్నారు. ఇసుక కొత్త పాలసీ విధివిధానాలకు కొంత మేరకు సమయం అవసరమని, ప్రభుత్వం ఎలా నడుచుకోవాలో చెప్పే అర్హత చంద్రబాబుకు లేదని విమర్శించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టికల్ 370 కు వైసీపీ మద్దతు ఇచ్చిందని తెలిపారు. టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఇటీవల పార్టీ వీడటంపై ఆయన స్పందిస్తూ, చంద్రబాబు అనుమతి లేకుండానే వారు బీజేపీలో చేరారా? అని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ సహకరించాలని కోరారు. టీడీపీ ట్రాప్ లో పడకుండా బీజేపీ ఉండాలని సూచించారు.
Andhra Pradesh
cm
jagan
Chandrababu
CR

More Telugu News