Prabhas: నాకు మూడు బలహీనతలు ఉన్నాయి: ప్రభాస్

  • నాకు మొహమాటం, బద్ధకం ఎక్కువ
  • జనాల్లో కూడా కలవలేను
  • సినిమా విడుదల రోజు టెన్షన్ తో చచ్చిపోయే స్థితికి వస్తా
వ్యక్తిగతంగా తనకు మొహమాటం, బద్ధకం చాలా ఎక్కువని హీరో ప్రభాస్ తెలిపాడు. జనాల్లో కూడా కలవలేనని చెప్పాడు. ఈ మూడు తన బలహీనతలని... వీటి నుంచి బయటపడాలని ఎన్నో సార్లు ప్రయత్నించినా మారలేకపోయానని తెలిపాడు. సినిమా విడుదలయ్యే రోజైతే టెన్షన్ తో చచ్చిపోయే స్థితికి వస్తానని... హార్ట్ అటాక్ వస్తుందేమో అన్నట్టుగా ఉంటుందని చెప్పాడు. సినిమా రిలీజ్ రోజున థియేటర్ లో అభిమానులతో కలసి చూడాలని అనుకుంటానని... 'రెబల్' సినిమా టైమ్ లో సగం దూరం వరకు వెళ్లి వచ్చేశానని తెలిపాడు. సినిమా విడుదల రోజున నిద్రపోతానని... సినిమా హిట్ అయితేనే నిద్ర లేపమని చెబుతానని అన్నాడు. 'బాహుబలి-1' రిలీజ్ రోజున తనను ఎవరూ నిద్ర లేపలేదని... తెలుగులో జనాలకు సినిమా నచ్చలేదని... అయితే, రెండో రోజు నుంచి పరిస్థితి మారిందని చెప్పాడు.
Prabhas
Tollywood

More Telugu News