Rahul Gandhi: మీ విమానం మాకేమీ వద్దు... మేమే వస్తున్నాం: కశ్మీర్ గవర్నర్ కు రాహుల్ గాంధీ రిప్లయ్!

  • రాహుల్ కోసం విమానం పంపుతానన్న మాలిక్
  • తనతో పాటు విపక్ష నేతలు కూడా వస్తున్నారన్న రాహుల్
  • స్వేచ్ఛగా పర్యటించేందుకు సహకరించాలని వినతి
జమ్మూకశ్మీర్ లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, చూడాలని భావిస్తే, రాహుల్ గాంధీ కోసం ఓ విమానం పంపుతానని రాష్ట్ర గవర్నర్ మాలిక్ చేసిన ట్వీట్ పై రాహుల్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ...

"డియర్ గవర్నర్ మాలిక్. నాతో కూడిన విపక్ష నేతల బృందం, మీ ఆహ్వానం మేరకు జమ్మూ అండ్ కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో పర్యటనకు వస్తోంది. మీ విమానం మాకేమీ వద్దు. అయితే, మేము స్వేచ్ఛగా తిరిగి, ప్రజలను కలుసుకుని, వారితో మాట్లాడే విషయంలో సహకరించండి. రాష్ట్ర నేతలను, సైనికులను కలుసుకునే ప్రయత్నాన్ని అడ్డుకోకండి" అని వ్యాఖ్యానించారు. 
Rahul Gandhi
Malik
Twitter
Jammu And Kashmir

More Telugu News