వరద బాధితులకు నటి జెనీలియా దంపతుల భారీ విరాళం
- వరదలతో అతలాకుతలమైన మహారాష్ట్ర
- ఇప్పటికీ వరద గుప్పిట్లో పలు ప్రాంతాలు
- జెనీలియా దంపతులను అభినందించిన సీఎం ఫడ్నవిస్
వరదలతో ఇటీవల మహారాష్ట్ర అతలాకుతలమైంది. ఇప్పటికీ పలు ప్రాంతాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. సంగ్లీ, కొల్హాపూర్, సతార జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వం 432 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసింది. మొత్తం 3.78 లక్షల మంది ప్రజలను ఈ కేంద్రాలకు తరలించారు. కాగా, వరదబాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన జెనీలియా దంపతులను సీఎం ఫడ్నవిస్ అభినందించారు.