Bonda Uma: నేను ఇండియాలో లేని సమయం చూసి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు: బోండా ఉమ

  • టీడీపీని వీడుతున్నారంటూ ఉమపై ప్రచారం
  • చంద్రబాబును కలిసిన ఉమ
  • తనకు చాలా పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని వెల్లడి
ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారంటూ విజయవాడ నేత బోండా ఉమపై విపరీతంగా ప్రచారం జరిగింది. ఆయన ఈ సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత తనకు చాలా పార్టీల నుంచి పిలుపులు అందాయని, కానీ తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తాను ఇండియాలో లేని సమయంలో లేనిపోని వదంతులు పుట్టించారని, పార్టీ మారేవాడ్నే అయితే ఇప్పుడు చంద్రబాబు ఇంటికి ఎందుకు వస్తానని ఉమ ప్రశ్నించారు.
Bonda Uma
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News