KCR: జగన్ పట్టుదల ఉన్న యువనేత... పెద్దన్నలా సహకరిస్తా: కేసీఆర్

  • తమిళనాడులోని అత్తి వరదరాజస్వామిని దర్శించుకున్న కేసీఆర్
  • తిరుగు ప్రయాణంలో రోజా నివాసానికి రాక
  • రెండు గంటలపాటు రోజా నివాసంలోనే గడిపిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాంచీపురంలోని అత్తి వరదరాజస్వామి ఆలయాన్ని సందర్శించారు. తిరుగు ప్రయాణంలో చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే రోజా నివాసానికి వచ్చారు. దాదాపు రెండు గంటలపాటు ఆయన రోజా నివాసంలోనే గడిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ ను పట్టుదల ఉన్న యువనేతగా అభివర్ణించారు. రాయలసీమ సర్వతోముఖాభివృద్ధి విషయంలో తాను జగన్ కు పెద్దన్నలా వ్యవహరిస్తానని, అన్ని విషయాల్లో సాయంగా ఉంటానని స్పష్టం చేశారు. రాయలసీమ ఆర్థిక పురోభివృద్ధికి గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి తాను, జగన్ కలిసి పనిచేస్తామని చెప్పారు.
KCR
Jagan
Roja
Andhra Pradesh
Telangana

More Telugu News