Chandrababu: వైసీపీ వాళ్లు తప్పులు చేస్తారు... ఆ తప్పుల్ని ఎత్తిచూపిన వాళ్లను చంపడానికి వెళతారు: చంద్రబాబు ఫైర్

  • ఓ విలేకరిని చంపుతామని ఎమ్మెల్యే బెదిరించడం దారుణమని వ్యాఖ్యలు
  • పోలీసు వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారంటూ మండిపాటు
  • ప్రభుత్వం ఉందా? లేదా? అంటూ నిలదీసిన టీడీపీ అధినేత
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలు తప్పులు చేస్తారని, ఆ తప్పుల్ని ఎత్తిచూపిన వాళ్లను చంపడానికి వెళతారని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే ఓ పాత్రికేయుడి ఇంటిపై దాడి చేసి, చంపుతామని బెదిరించడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు, రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? అని ప్రశ్నించారు. 'జమీన్ రైతు' ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడికి పాల్పడినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు ఈ ట్వీట్ చేశారు.
Chandrababu
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News