Jagan: అన్నదాతల ముఖాల్లో ఆనందం నింపేలా ప్రకృతి సహకరించడం శుభసూచకం: సీఎం జగన్
- ట్విట్టర్ లో సంతోషం వెలిబుచ్చిన ఏపీ సీఎం
- కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందంటూ ట్వీట్
- శ్రీశైలం, నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యాన్ని చేరుకుంటున్నాయని వెల్లడి
రాష్ట్రంలోని ప్రధాన డ్యాములన్నీ జలకళతో పరవళ్లు తొక్కడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి మరికాస్త దూరంలోనే ఉన్నాయని ట్వీట్ చేశారు. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరుగులు పెడుతోందని పేర్కొన్నారు. అన్నదాతల ముఖాల్లో ఆనందం నింపేలా ప్రకృతి కూడా రైతులకు సహకరిస్తుండడం శుభసూచకం అని తెలిపారు. ఇటీవలే, శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాముల నుంచి నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడడంతో శ్రీశైలం ప్రాజక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది.