Tammineni Sitaram: సీఎంగా ఉన్న వ్యక్తికి దమ్ముండాలి: స్పీకర్ తమ్మినేని

  • సీఎం జగన్ లో ఆ దమ్ముందన్న స్పీకర్
  • అందుకే సామాజిక న్యాయంతో చట్టాలు చేశారంటూ కితాబు
  • వలంటీర్ల ఎంపికపై టీడీపీ వాళ్లు పిటిషన్లు వేసినా భయపడవద్దంటూ వ్యాఖ్యలు
స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లాలో జరిగిన గ్రామ వలంటీర్ల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఉన్న వ్యక్తికి దమ్ముండాలని, జగన్ లో ఆ దమ్ముందని అన్నారు. అందుకే సామాజిక న్యాయంతో చట్టాలు చేయగలిగారని పేర్కొన్నారు. సీఎం జగన్ మాటకు కట్టుబడి మనసుతో పరిపాలన సాగిస్తున్నారని తమ్మినేని తెలిపారు. వలంటీర్ల ఎంపికపై టీడీపీ వాళ్లు పిటిషన్లు వేసినా ఎవరూ భయపడవద్దని అన్నారు. ఆగస్టు 18 తర్వాత గ్రామాల్లో ఆయా ఎమ్మెల్యేలు పర్యటిస్తారని చెప్పారు. ఇప్పుడు ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థ గురించి ఇతర రాష్ట్రాలే కాకుండా, అనేక దేశాల నుంచి ఆసక్తి వ్యక్తమవుతోందని, శ్రీలంక, మలేసియా దేశాలు కూడా సచివాలయ వ్యవస్థను పరిశీలిస్తున్నాయని వివరించారు.
Tammineni Sitaram
Jagan
Andhra Pradesh
CM

More Telugu News