Goshala: తాడేపల్లి గోశాలను సందర్శించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

  • గోశాలలో 86 ఆవులు హఠాన్మరణం
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాజాసింగ్
  • ఇందులో కుట్ర ఉండొచ్చంటూ సందేహం
విజయవాడ సమీపంలోని గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు మృత్యువాత పడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారే ఇన్ని ఆవులు మృతి చెందడం వెనుక కుట్ర ఉండొచ్చని అన్నారు. ఏపీ సర్కారు ఈ ఘటనపై చిత్తశుద్ధితో విచారణ జరిపించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వాళ్లకు తప్పకుండా శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 86 ఆవులు మరణించడం తెలిసిందే. మరికొన్ని ఆవులు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. విజయవాడ శివారు తాడేపల్లి గోశాలలో 1500 వరకు ఆవులు ఉన్నాయి. కొందరు మార్వాడీలు గోసంరక్షణ సంఘంగా ఏర్పడి వాటి పోషణ బాధ్యతలు స్వీకరించారు.
Goshala
Raja Singh
BJP
Andhra Pradesh
Telangana

More Telugu News