Fire on board: విశాఖ ‘కోస్టల్ జాగ్వార్’ నౌకలో మంటలు.. సముద్రంలోకి దూకేసిన 29 మంది సిబ్బంది!

  • విశాఖపట్నం సమీపంలో ఘటన
  • 28 మందిని కాపాడిన నేవీ, ఒకరు గల్లంతు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
విశాఖపట్నం సముద్రతీరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బంగాళాఖాతంలో ఉన్న ఆఫ్ షోర్ సపోర్ట్ నౌక ‘ కోస్టల్ జాగ్వార్’లో ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నౌకలోని 29 మంది నీటిలోకి దూకేశారు. వీరిలో 28 మందిని నౌకాదళం సిబ్బంది, కోస్ట్ గార్డులు కాపాడగా, మిగిలిన ఒకరి జాడ ఇంకా తెలియరాలేదు.

గల్లంతైన అతని కోసం నౌకాదళం సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదం చోటుచేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సముద్రంలోని కోస్టల్ జాగ్వార్ నౌక మండుతూనే ఉండటంతో దాన్ని ఆర్పేందుకు నేవీ సిబ్బంది, కోస్ట్ గార్డులు ప్రయత్నిస్తున్నారు.
Fire on board
Offshore Support Vessel
Coastal Jaguar
jump into water
Andhra Pradesh
Visakhapatnam District
Twitter

More Telugu News