Road Accident: రోడ్డు పక్కన షెడ్డులోకి దూసుకువెళ్లిన కారు.. ముగ్గురికి గాయాలు

  • కరీంనగర్‌ జిల్లా రాజీవ్‌గాంధీ రోడ్డుపై ఘటన
  • కారులో ఉన్న వారికి తీవ్రగాయాలు
  • హైదరాబాద్‌ నుంచి వస్తుండగా ఘటన
హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వస్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన షెడ్డులోకి దూసుకువెళ్లిన ఘటనలో కారులో ఉన్నవారు ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయానికి రేకుల షెడ్డులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌కు చెందిన నర్సింగ్‌భూషణ్‌ కుటుంబ సభ్యులు స్వరూప, విజయతో కలిసి కారులో వస్తున్నారు. ఈరోజు తెల్లవారు జామున రాజీవ్‌గాంధీ రోడ్డులో వస్తున్న కారు కరీంనగర్‌ జిల్లా గుండపల్లి స్టేజిదగ్గరకు వచ్చేసరికి అదుపుతప్పింది. పక్కనే ఉన్న రేకుల షెడ్డులోకి దూసుకుపోవడంతో అది పూర్తిగా ధ్వంసమయ్యింది. షెడ్డులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కానీ కారులో ఉన్నవారు గాయపడ్డారు.
Road Accident
car rides in shed
three injured

More Telugu News