KCR: రేణిగుంట విమానాశ్రయంలో కేసీఆర్ కు ఘన స్వాగతం

షార్ట్స్‌లో చూడండి
తిరుమల, కంచి పర్యటనకు బయల్దేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. తన భార్య, కుమార్తె కవిత, కొందరు నేతలతో కలసి కేసీఆర్ ప్రత్యేక విమానంలో తిరుపతికి వెళ్లారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో కేసీఆర్ కు ఘన స్వాగతం లభించింది. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్ కు స్వాగతం పలికారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుమల శ్రీవారిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో కంచికి బయల్దేరుతారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో, తిరుపతిలో భారీ ఎత్తున స్వాగతాలతో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి.
Go Back to Shorts
KCR
Tirupati
TRS
YSRCP

More Telugu News