Andhra Pradesh: పాలిచ్చే ఆవు, పాలు మరవని దూడ కలిసి ఆ ‘కోడె’ల సంగతి చూడండి!: విజయసాయిరెడ్డి వెటకారం
- ఐదేళ్ల పాటు ఆయన్ను ఆంబోతులా వదిలారు
- కోడెల గుంపు పొడిచి, తన్నని ప్రజలు మిగల్లేదు
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. పాలిచ్చే ఆవును కాదని దున్నపోతును ఏపీ ప్రజలు తెచ్చుకున్నారని చంద్రబాబు సందర్భోచితంగా చెప్పిన వ్యాఖ్యలపై వెటకారంగా స్పందించారు. పాలిచ్చే ఆవు(చంద్రబాబు), పాలు మరవని దూడ(లోకేశ్) కలిసి ఆ ‘కోడె’ల సంగతి చూడాలని విజయసాయిరెడ్డి సూచించారు.
ఆయన్ను చంద్రబాబు ఐదేళ్ల పాటు జనంపైకి ఆంబోతులా వదిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల గుంపు పొడిచి, తన్నని ప్రజలు మిగలలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇకనైనా దొడ్లో కట్టేయాలనీ, లేదంటే తరిమివేయాలని అన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.