KCR: మరి కాసేపట్లో కంచి, తిరుమల పర్యటనలకు బయల్దేరనున్న కేసీఆర్

  • కుటుంబంతో కలసి పుణ్యక్షేత్రాల దర్శనకు వెళ్తున్న కేసీఆర్
  • మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుమల వెంకన్నను దర్శించుకోనున్న సీఎం
  • అక్కడి నుంచి కంచికి పయనం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో తిరుమల, తమిళనాడులోని కంచి పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. తన కుటుంబంతో కలసి ఆయన ఈ ఆలయాలను దర్శించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి కంచికి బయల్దేరనున్నారు. అక్కడున్న అత్తి వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో, తిరుమలలో టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 
KCR
Tirumala
Kanchi

More Telugu News