Guntur District: ఏలూరులో పేదల భూ సమస్యను పరిష్కరించాలి..సీఎం జగన్ కు లేఖ రాస్తా: కేంద్ర మంత్రి అథవాలే

  • మంగళగిరిలో ఆర్పీఐ (ఏ) కార్యకర్తల భేటీ
  • ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర మంత్రి అథవాలే
  • ఏపీలో సమస్యల పరిష్కారం కోరుతూ సీఎంకు లేఖ రాస్తా
గుంటూరు జిల్లా లోని మంగళగిరిలోరిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) కార్యకర్తల సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు రామ్ దాస్ అథవాలే వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏలూరులో పేదల భూ సమస్యను పరిష్కరించాలని, బ్యాక్ లాగ్ పోస్టలు భర్తీ చేయాలని కోరుతూ సీఎం జగన్ కు లేఖ రాస్తానని అన్నారు. అటవీ ప్రాంత భూమిని పేదలకు అందించేలా కృషి చేస్తామని చెప్పారు. కులాంతర వివాహాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఈ వివాహాలు చేసుకున్న వారికి కేంద్ర తరపున రూ.2.5 లక్షలు, రాష్ట్రం తరపున రూ.75 వేలు ఇస్తున్నారని అన్నారు. 
Guntur District
Mangalagiri
RPI(A)
Ramdas Athwale

More Telugu News