Toss: రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా
వెస్టిండీస్ తో రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆతిథ్యమిస్తోంది. ఇరు జట్లు ఈ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతున్నాయి. ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో కోహ్లీ మరో ఆలోచనకు తావులేకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్ తో విండీస్ యోధుడు క్రిస్ గేల్ 300వ వన్డే ఆడుతున్నాడు. దాంతో అందరి దృష్టి ఈ విధ్వంసక వీరుడిపైనే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.