T-Telugudesam: బీజేపీ ఎండమావులను చూసి టీడీపీ నేతలు మోసపోవద్దు: రావుల చంద్రశేఖర్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
‘బీజేపీ ఆకర్ష్’ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని పలు పార్టీల నేతలకు భారతీయ జనతా పార్టీ వల వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ-టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ, టీటీడీపీని ఖాళీ చేయడం ఎవరి తరం కాదని అన్నారు. బీజేపీ ఎండమావులను చూసి టీడీపీ నేతలు మోసపోవద్దని కోరారు. టీడీపీ తెలంగాణలో పుట్టిన పార్టీ అని, ఆంధ్రా పార్టీ కాదని అన్నారు. టీడీపీలో ఉండి ఎదిగిన వాళ్లే ఈ పార్టీని వీడాక చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబును నిన్న ఎల్.రమణ, తాను కలిసిన విషయాన్ని ప్రస్తావించారు. టీడీపీ తదుపరి పొలిట్ బ్యూరో సమావేశం హైదరాబాద్ లో నిర్వహించనున్నట్టు చంద్రబాబు ప్రకటించినట్టు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 26న ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.  
Go Back to Shorts
T-Telugudesam
Ravula Chandra sheker Reddy
bjp

More Telugu News