Shashi Tharoor: తన ఫొటోను మార్ఫింగ్ చేయడంపై శశి థరూర్ ఆశ్చర్యం

  • షేక్స్పియర్ వేషధారణతో ఉన్న థరూర్ ఫొటో వాట్సాప్ లో వైరల్
  • ఆ గౌరవానికి తాను ఎంతమాత్రం తగనని చెప్పిన థరూర్
  • ఎంతో కష్టపడి మార్ఫింగ్ చేశారంటూ కృతజ్ఞతలు చెప్పిన కాంగ్రెస్ నేత
సోషల్ మీడియాలో సమయస్ఫూర్తితో కూడిన పోస్టులు పెట్టడంలోనూ, సందర్భానికి తగినవిధంగా ఛలోక్తులు విసరడంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ దిట్ట. అయితే, ఇవాళ వాట్సాప్ లో మార్ఫింగ్ చేసిన ఆయన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. దాన్ని చూసిన థరూర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన ముఖాన్ని షేక్స్పియర్ తీరులో మార్ఫింగ్ చేయడం పట్ల ఆయన స్పందించారు. విలియం షేక్స్పియర్ అంతటి మహనీయుడితో తనను పోల్చడం సరికాదని, ఆ గౌరవానికి తాను ఏమాత్రం తగనని వినమ్రంగా తెలిపారు. ఆ ఫొటో చూస్తుంటే తనను మరీ ఆకాశానికెత్తేస్తున్నట్టుగా ఉందన్నారు. తనను షేక్స్పియర్ తో పోల్చాలని భావించడం విస్మయం కలిగిస్తోందని థరూర్ ట్వీట్ చేశారు. ఎంతో కష్టపడి తన ఫోటోను మార్ఫింగ్ చేసినందుకు ఆ నెటిజన్ కు కృతజ్ఞతలు తెలిపారు,
Shashi Tharoor
Congress

More Telugu News