Chandrababu: చంద్రబాబే నన్ను బీజేపీలోకి పంపించారనడం ఘోరం: సీఎం రమేశ్ ఆవేదన

  • ఇటీవలే బీజేపీలో చేరిన సీఎం రమేశ్
  • చంద్రబాబే ప్రోత్సహించారంటూ ఆరోపణలు
  • కొట్టిపారేసిన సీఎం రమేశ్
ఎన్నికల అనంతరం టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తనపై వస్తున్న ఆరోపణలకు స్పందించారు. చంద్రబాబే తనను బీజేపీలోకి పంపించారని ప్రచారం జరుగుతుండడం దారుణమని అన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు అందుకు తగిన ఆధారాలు చూపించగలరా? అని సవాల్ చేశారు. చంద్రబాబు తనను ఎందుకు బీజేపీలోకి వెళ్లమని ప్రోత్సహిస్తాడంటూ సీఎం రమేశ్ ప్రశ్నించారు. టీడీపీ నుంచి తనతో చాలామంది టచ్ లో ఉన్నారని వెల్లడించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలే అయిందని, ఇంకా కొన్ని రోజులు వేచి చూసి అప్పుడు వారిపై స్పందిస్తామని తెలిపారు.
Chandrababu
CM Ramesh
Andhra Pradesh
Rajya Sabha

More Telugu News