Rajanikant: మోదీ-షాలు కృష్ణార్జనులే: రజనీకాంత్ పొగడ్తల వర్షం

  • మోదీ చెబితే చేయడమే షా లక్ష్యం
  • కశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో బీజేపీ సక్సెస్
  • పార్లమెంట్ లో అమిత్ షా అద్భుతంగా మాట్లాడారన్న రజనీ
ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షాలపై దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ పొగడ్తల వర్షం కురిపించారు. వీరిద్దరూ కృష్ణార్జనుల వంటివారని, మోదీ ఏదైనా చెబితే, దాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా షా కృషి చేస్తారని అన్నారు. కశ్మీర్ అంశంపై వారిద్దరి వైఖరి, ఆర్టికల్ 370లను ప్రస్తావించిన రజనీకాంత్, ఈ విషయంలో తనకెంతో సంతోషం కలిగిందని, వారిద్దరూ కలిసి కాశ్మీర్ ను భారత్ లో పూర్తిగా విలీనం చేయడంలో విజయవంతం అయ్యారని అన్నారు.

చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన కశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో బీజేపీ విజయం సాధించిందని చెప్పారు. 370 బిల్లుపై పార్లమెంట్ లో అద్భుతంగా ప్రసంగించారని కొనియాడారు.
Rajanikant
Narendra Modi
Amit Shah

More Telugu News