Venkaiah Naidu: పుస్తకం రాసిన వెంకయ్యనాయుడు... ఆవిష్కరించిన అమిత్ షా!

షార్ట్స్‌లో చూడండి
ఉపరాష్ట్రపతిగా తన రెండేళ్ల ప్రస్థానాన్ని వివరిస్తూ ముప్పవరపు వెంకయ్యనాయుడు రచించిన 'లిజనింగ్.. లెర్నింగ్.. లీడింగ్' పుస్తకాన్ని కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. చెన్నైలోని కలైవనర్ ఆరంగం వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా, ఈ పుస్తకాన్ని విడుదల చేసి ప్రసంగించారు. ఈ పుస్తకంలో వెంకయ్యనాయుడు తన అనుభవాలను పంచుకున్నారని, అవి యువతకు మార్గ నిర్దేశనం చేస్తాయని అభిప్రాయపడ్డారు. కాగా, వెంకయ్యనాయుడు నిర్వహించిన 330 ప్రజా కార్యక్రమాల వివరాలను కూడా పుస్తకంలో పొందుపరిచారు.
Go Back to Shorts
Venkaiah Naidu
Amit Shah
Book
Chennai

More Telugu News