Andhra Pradesh: గుంటూరు జిల్లాలో దారుణం.. టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు!

  • సత్తెనపల్లిలోని కట్టమూరులో ఘటన
  • ఆఫీసుకు మంటపెట్టి పరారైన నిందితులు
  • మంటల్లో పాక్షికంగా కాలిపోయిన కార్యాలయం
గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలం కట్టమూరులో గుర్తుతెలియని వ్యక్తులు టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. కార్యాలయానికి మంటలు అంటుకోవడాన్ని గమనించిన టీడీపీ శ్రేణులు వాటిని ఆర్పేశాయి.

అయితే ఈ ఘటనలో టీడీపీ కార్యాలయం పాక్షికంగా దెబ్బతింది. ఈ వ్యవహారంపై టీడీపీ గ్రామ అధ్యక్షుడు శ్యాంసుందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో టీడీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh
Guntur District
Fire Accident
Telugudesam
Office
Police

More Telugu News