Andhra Pradesh: అనవసర విషయాల్లో అత్యుత్సాహం చూపే జగన్ ఇసుక విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు!: కన్నా

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శల దాడిని పెంచారు. వైసీపీ ప్రభుత్వానికి ఆత్రం తప్ప పనిలో శ్రద్ద లేదని కన్నా దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన ఉండటం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇసుక సరఫరా ఆగిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారనీ, లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని చెప్పారు.

గుంటూరు జిల్లాలో ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. అనవసరమైన విషయాల్లో అత్యుత్సాహం చూపే సీఎం జగన్ ఇసుక పాలసీ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని కన్నా ప్రశ్నించారు. ఏపీలో టీడీపీ-బీజేపీ కలిసే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Jagan
Chief Minister
kanna
BJP
sand policy

More Telugu News