Ganta Srinivasa Rao: ప్రస్తుతానికి టీడీపీలోనే.. పార్టీ మార్పుపై గంటా స్పష్టత

  • గంటా పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు
  • అవన్నీ నిరాధారమన్న గంటా
  • కొన్ని మీడియా సంస్థలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపాటు
తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం తాను టీడీపీలోనే ఉన్నానని, సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ఆ వార్తలు పూర్తిగా నిరాధారమని, కార్యకర్తలు ఎవరూ వాటిని నమ్మవద్దని కోరారు. తాను కనుక పార్టీ మారాల్సి వస్తే అందరితో చర్చించాక, అందరికీ చెప్పే బయటకు వెళ్తానన్నారు. తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటిస్తానన్నారు. తాను పార్టీ మారబోతున్నానంటూ కొన్ని మీడియా సంస్థలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని గంటా మండిపడ్డారు.
Ganta Srinivasa Rao
Telugudesam
Andhra Pradesh

More Telugu News