జమ్మూకశ్మీర్ ప్రశాంతం... ఒక్క తుపాకి కూడా పేలలేదంటున్న అధికారులు!
- ఆర్టికల్ 370 రద్దు తరువాత పరిస్థితి ప్రశాంతం
- ఒకటి రెండు ప్రాంతాల్లో రాళ్లు రువ్విన ఘటనలు
- జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్
జమ్మూకశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉందని, ఆ వార్తలను మీడియా ప్రసారం చేయాలని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో దిల్ బాగ్ సింగ్ స్పందించారు. రాహుల్ వ్యాఖ్యల తరువాత నిమిషాల్లోనే జమ్మూకశ్మీర్ పోలీసు విభాగం అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ లో దిల్ బాగ్ స్టేట్ మెంట్ ను ఉంచింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ విధ్వంస ఘటనలు నమోదు కాలేదని ఆయన అన్నారు. ప్రజలు ఎవరూ ఊహాజనిత వార్తలను, వైరల్ అయ్యే వార్తలను నమ్మవద్దని ఆయన అన్నారు.