Tamil Nadu: తండ్రి మృతదేహం వద్దే వధువు మెడలో తాళికట్టిన యువకుడు!

  • పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా మృతి చెందిన వరుడి తండ్రి
  • అందరి అనుమతితో తండ్రి మృతదేహం వద్దే తాళికట్టిన యువకుడు
  • తమిళనాడులో ఘటన
శీర్షిక చూసి యువకుడు తప్పు చేశాడని అనుకుంటే పొరపాటే. తండ్రిపై ప్రేమతో చేశాడా పని. తమిళనాడులోని విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలోని సింగనూరుకు చెందిన అలెగ్జాండర్ (27) ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతడు పనిచేస్తున్న స్కూల్‌లోనే పనిచేస్తున్న జగదీశ్వరి (23)తో ప్రేమలో పడ్డాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. వచ్చే నెల 2న పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో రెండు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో తలమునకలయ్యాయి.

కాగా, అదే సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైన అలెగ్జాండర్ తండ్రి దైవమణి శక్రవారం మృతి చెందాడు. దీంతో అలెగ్జాండర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే, తండ్రిపై అపార ప్రేమ ఉన్న అలెగ్జాండర్ తండ్రి మృతదేహం వద్దే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని జగదీశ్వరి కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు కూడా అందుకు అనుమతించడంతో జగదీశ్వరి మెడలో తాళి కట్టాడు.
Tamil Nadu
marriage
father
love
dead body

More Telugu News