Nepoleon Bonaparte: ఆ చక్రవర్తి ప్రేమలేఖ విలువ రూ.3.97 కోట్లు!

  • తన భార్య జోసెఫిన్ కు ప్రేమలేఖ రాసిన నెపోలియన్
  • ఇటీవలే వేలానికి వచ్చిన దాదాపు 200 ఏళ్ల నాటి లేఖ  
  • కోట్లు కొల్లగొట్టిన లేఖ
ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్ చారిత్రక పురుషుడు. ఆయన తన భార్య జోసెఫిన్ పట్ల జీవితకాలం మొత్తం చూపిన అనురాగం ఎంతో ప్రసిద్ధి కెక్కింది. ముఖ్యంగా, ఆయన తన భార్యకు రాసిన ప్రేమలేఖకు సాహిత్యపరంగానూ ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడా ప్రేమలేఖ వేలంలో కోట్లు కొల్లగొట్టింది. దాదాపు 200 ఏళ్ల క్రితం నెపోలియన్ తన అర్ధాంగి జోసెఫిన్ కు స్వదస్తూరీతో ప్రేమలేఖ రాశాడు. "ప్రియతమా, మీరు చాలా తీరిక లేకుండా ఉన్నారేమో, మీ భర్త గారిని కూడా మరిచినట్టున్నారు. అయిననూ తరచుగా మీరు గుర్తుకువస్తున్నారు, అందుకే ఈ లేఖ... అందుకోండి!" అంటూ ఆ లేఖలో నెపోలియన్ తన మనోభావాలను వెల్లడించారు. ఈ లేఖను ఇటీవలే వేలం వేయగా రూ.3.97 కోట్లు పలికింది.
Nepoleon Bonaparte
France

More Telugu News