Andhra Pradesh: మొదట మండలానికి ఓ పాఠశాలను ఆధునికీకరిస్తాం: విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్

  • సీఎం జగన్ ఆధ్వర్యంలో విద్యాశాఖ సమీక్ష
  • హాజరైన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
  • త్వరలోనే ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని వెల్లడి
ఏపీ సీఎం జగన్ ఇవాళ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా పాల్గొన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ ప్రైమరీ స్కూళ్లలో మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించారని వెల్లడించారు. మొదట మండలానికి ఓ పాఠశాలను ఆధునికీకరిస్తామని చెప్పారు. ఆ తర్వాత దశలవారీగా ఇతర స్కూళ్లను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక, స్కూళ్లలో టీచర్ల సంఖ్య గురించి చెబుతూ, విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా టీచర్ల నియామకం ఉంటుందని వివరించారు. త్వరలోనే ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు.
Andhra Pradesh
Jagan
Adimulapu Suresh

More Telugu News