KTR: తమతో ఉంటే దేశభక్తులు, లేకపోతే దేశద్రోహులుగా ముద్రవేస్తున్నారు: కేటీఆర్

  • తెలంగాణ వికాస్ సమితి మహాసభలకు హాజరైన కేటీఆర్
  • గాంధీని గౌరవించని జాతి మనది అనే బాధ కలిగిందంటూ వ్యాఖ్య
  • ప్రజ్ఞాసింగ్, గాడ్సేలను దేశభక్తులు అంటే ఖండించానని వెల్లడి
దేశంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయంటూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమతో ఉంటే దేశభక్తులు, లేకపోతే దేశద్రోహులు అంటూ ముద్రవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో తెలంగాణ వికాస్ సమితి మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, గాడ్సేలను దేశభక్తులు అంటే ఖండించానని తెలిపారు. కొందరి వ్యాఖ్యల ఫలితంగా మహాత్మాగాంధీని గౌరవించని జాతి మనది అనే బాధ కలిగిందని అన్నారు. దేశంలో మతం, జాతీయవాదం పెనవేసుకుపోయాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
KTR
Hyderabad
Telangana
TRS

More Telugu News