Telugudesam: టీడీపీ వీడతారన్న వదంతుల నేపథ్యంలో బోండా ఉమతో బుద్ధా చర్చలు

  • టీడీపీని బోండా ఉమ వీడతారంటూ ప్రచారం 
  • బాబు ఆదేశాల మేరకు ఉమతో బుద్ధా వెంకన్న చర్చలు
  • టీడీపీని వీడే ప్రసక్తే లేదని చెప్పిన ఉమ
విజయవాడకు చెందిన టీడీపీ నేత బోండా ఉమ ఆ పార్టీని వీడనున్నట్టు వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఉమతో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చర్చలు జరిపారు. ఉమ నివాసానికి ఈరోజు ఆయన వెళ్లి కలిశారు. టీడీపీని వీడతారన్న వదంతుల గురించి ప్రస్తావించగా, తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని వెంకన్నకు ఉమ చెప్పినట్టు సమాచారం. ఈ నెల 12న చంద్రబాబును బోండా ఉమ కలవనున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

కాగా, 2014లో తొలిసారిగా టీడీపీ నుండి బోండా ఉమ ఎమ్మెల్యే (విజయవాడ సెంట్రల్) గా ఎన్నికయ్యారు. కాకినాడలో ఇటీవల జరిగిన టీడీపీ కాపు నేతల సమావేశంలో ఆయన పాల్గొనడం గమనార్హం. టీడీపీ అధినేత చంద్రబాబు తన నివాసంలో గత నెలలో నిర్వహించిన కీలక సమావేశానికి ఉమ హాజరుకాలేదు. దీంతో, టీడీపీని ఆయన వీడుతున్నారన్న ప్రచారం మొదలైంది.
Telugudesam
Chandrababu
Bonda
Buddha
Venkanna

More Telugu News