Guntur: కోడెల కుమారుడు శివరామ్ కు చెందిన షోరూమ్ సీజ్

  • ఒకటి గుంటూరులోని గౌతమ్ హోండా షోరూమ్
  • మరోటి నరసరావుపేటలోని యర్రంశెట్టి హీరో షోరూం
  • నిబంధనలకు విరుద్ధంగా వాహనాల విక్రయం
ఏపీ టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ పై పలు ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా, గుంటూరులోని చుట్టుగుంట సెంటర్ లో శివరామ్ కు చెందిన గౌతమ్ హోండా షోరూమ్ ను, నరసరావుపేటలో శివరామ్ బినామీగా చెప్పుకునే యర్రంశెట్టి హీరో షోరూంలను అధికారులు సీజ్ చేశారు. ఈ షోరూంలు పన్నులు చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు విక్రయించాయన్న ఆరోపణల నేపథ్యంలో వాటిని అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. ఐదేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నట్టు అధికారుల తనిఖీల్లో బయటపడినట్టు తెలుస్తోంది. 
Guntur
Narasaraopet
Kodela
Siva ram

More Telugu News