YSRCP: వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన జగన్

  • తాడేపల్లిలో కేంద్ర కార్యాలయం ప్రారంభం
  • నందిగం సురేశ్, ఆమంచి చేత రిబ్బన్ కట్ చేయించిన జగన్
  • భారీ సంఖ్యలో హాజరైన నేతలు, కార్యకర్తలు
గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ చేత జగన్ రిబ్బన్ కట్ చేయించారు. అనంతరం కార్యాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించారు.

అంతకు ముందు కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత రాజశేఖరరెడ్డి విగ్రహానికి జగన్ పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
YSRCP
Office
Jagan
Tadepalli

More Telugu News