Convertion of Religion: మోదీ తదుపరి లక్ష్యం మతమార్పిడిలు... వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు?

  • గత పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం
  • మతమార్పిడి నిరోధక బిల్లుపై దృష్టి సారించిన మోదీ సర్కార్
  • ఇప్పటికే లోతుగా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం
ఇప్పటికే ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు... సరిహద్దు ప్రాంతంలోని జమ్ముకశ్మీర్ ప్రజలకు రిజర్వేషన్లు, జమ్ముకశ్మీర్ పునర్విభజన, టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నవారిని ఉగ్రవాదులుగా ప్రకటించడం వంటి అంశాలను పరిష్కరించిన మోదీ సర్కార్... ఇప్పుడు మరో కీలక అంశంపై దృష్టి సారించినట్టు సమాచారం. అదే మతమార్పిడిలు. తదుపరి పార్లమెంటు సమావేశాల్లో మతమార్పిడి నిరోధక బిల్లును మోదీ సర్కారు తీసుకురానుందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై లోతుగా చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే దేశంలో ఏ రకమైన మతమార్పిడిలకు తావు ఉండదు.
Convertion of Religion
Bill
Parliament
Modi

More Telugu News