Tadepalli: తాడేపల్లి గోశాలలో విషాదం... ఒకేసారి 100 ఆవులు మృతి

  • మరికొన్ని ఆవుల పరిస్థితి విషమం
  • గోశాలలోనే ఆవులకు చికిత్స అందిస్తున్న వైద్యులు
  • పోస్టుమార్టంలో వెల్లడి కానున్న కారణాలు
విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో విషాదకర వాతావరణం నెలకొంది. ఒకేసారి 100 ఆవులు మృతి చెందడం కలకలాన్ని రేపుతోంది. మరికొన్ని ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి ఆవులకు పెట్టిన దాణాలో ఏదో తేడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతి చెందిన ఆవులకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టంలో ఆవుల మృతికి గల కారణాలు తెలుస్తాయని వైద్యులు చెప్పారు. గోశాలలో ఉన్న మిగిలిన ఆవులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Tadepalli
Cows
Dead

More Telugu News