Andhra Pradesh: అలా నిలదీస్తున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?: ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు సూటి ప్రశ్న
- ‘ఇద్దరిని ఉద్యోగం నుంచి తీసేశా, ఒకరికి ఉద్యోగం ఇచ్చా’
- ఏపీ ప్రభుత్వం తీరు అలా ఉంది
- అమలు చేయడం చేతకానప్పుడు హామీలు ఇవ్వడం దేనికి?
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోమారు విమర్శలు గుప్పించారు. ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన ప్రభుత్వం తీరు ‘ఇద్దరిని ఉద్యోగం నుంచి తీసేశా, ఒకరికి ఉద్యోగం ఇచ్చా’ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయడం చేతకానప్పుడు ఇవ్వడం దేనికి? అని నిలదీస్తున్న ప్రజలకు ఏం చెప్పుకుంటారు? ‘ప్రజలను మోసం చేయడానికే అలా చెప్పాం అని ఒప్పుకుంటారా? అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన చంద్రబాబు, ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ‘మమ్మల్ని ఉద్యోగాల్లో నుంచి తీసేసి కొత్త ఉద్యోగాలు లక్ష ఇస్తానని చెప్పుకుంటే సరిపోయిందా?..’ అంటూ ఓ మహిళ మండిపడడాన్ని ఆ వీడియోలో గమనించవచ్చు.