Chandrababu: ఈ ఐదేళ్లలో ఎన్నడూ చేయనంత అభివృద్ధి చేశా, అయినా 23 సీట్లు రావడమేంటో అర్థం కావడంలేదు: చంద్రబాబు

  • గుంటూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం
  • హాజరైన చంద్రబాబు
  • ఓటమిపై విస్మయం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ మధ్యాహ్నం గుంటూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో గత ఐదేళ్లలో ఎన్నడూ చేయనంత అభివృద్ధి చేశానని, అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చానని చెప్పారు. అయినప్పటికీ కేవలం 23 సీట్లు రావడమేంటో అర్థం కావడంలేదని విస్మయం వ్యక్తం చేశారు.  పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ఎవరి పట్ల కూడా వివక్ష చూపలేదని స్పష్టం చేశారు. అంత కష్టపడినా గానీ అలాంటి ఫలితం రావడం ఇప్పటికీ బోధపడడంలేదని ఆశ్చర్యపోయారు.
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News